మాంద్యం :
వరుసగా రెండు త్రైమాసికాల పాటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రతికూలంగా నమోదైతే ఆ దేశు మాంద్యంలో ఉందంటారు. జీడీపీతో పాటు నిరుద్యోగం, వ్యక్తిగత ఆదాయం, వినియోగదారు వ్యయాలు, పారిశ్రామిక ఉత్పత్తి వంటివి ఎక్కువ కాలం పాటు క్షీణించొచ్చని నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ రీసెర్చ్ కమిటీ చెబుతోంది. కరోనా పరిణామాల్లో కేవలం 2 నెలల ఏటే అమెరికాలో మాంద్యం ఏర్పడినా, త్వరగా పుంజుకుంది.
ప్రస్తుత పరిస్థితి ఇలా :
అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఈ ఏడాది జనవరిలో భావించారు. నిరుద్యోగ రేటు తక్కువగా ఉండగా, అప్పల్లో వేతనాలు పెరిగాయి. అంటే వినియోగదార్లు ఖర్చు చేసే సామర్థ్యంలోనే ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. అమెరికాలోకి దిగుమతి అవుతున్న ఇతర దేశాల ఉత్పత్తులపై భారీ స్థాయిలో ట్రంప్ సుంకాలు విధించడంతో, అక్కడి స్టాక్ మార్కెట్ సెప్టెంబరు నాటి కనిష్ఠ స్థాయిలకు పడిపోయింది. చైనాపై సుంకాలంటే అర్థం చేసుకోవచ్చు కానీ: అమెరికాకు పొరుగున ఉండే మెక్సికో, కెనడాలపై సుంకం యుద్ధాలు ఎందుకు అని అక్కడి కంపెనీల నిర్వాహకులే ఆశ్చర్యపోతున్నారు. కరోనా సమయంలో షట్ డౌన్ అనంతరం ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు లభించడంతో ఆర్థిక వృద్ధి బలంగా నమోదైంది. ఇపుడు మాంద్యం వస్తే, ఆర్ధిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు తగిన నిధుల బలం ఉండకపోవచ్చన్న ఆందోళనలు ఉన్నాయి.
భారత్ ఏమంటోంది?
ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలను భారత్వైనా విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అంటే అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో, అదే తరహా భారత ఉత్పత్తులపై అమెరికా అంతే సుంకం విధించడం, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భారత్ ప్రయత్నిస్తున్నా, ప్రస్తుతానికి అనిశ్చితే నెలకొంది టారిపిలపై నిర్ణయం తీసుకోవడానికి సెప్టెంబరు వరకు సమయం కోరుతోంది. అమెరికా టారిఫ్ సంకటం వల్ల వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు వైదొలగుతున్నారు. దీంతో మార్కెట్లు నష్టపోతున్నాయి. ఈ విషయంలో ఇతర దేశాల కంటే భారత్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని చెబుతున్నారు. దేశీయ కార్పొరేట్ కంపెనీల ఫలితాల్లో రికవరీ ఏర్పడితే, దేశీయ మదుపర్ల సెంటిమెంటు మెరుగుపడే అవకాశం ఉందని బ్రోకరేజీలు చెబుతున్నాయి.
మనపై ఎంత ప్రభావం ఉండొచ్చు?
- అమెరికాలో మాంద్యం వస్తే మనదేశం పై కొన్ని అంశాల్లో ప్రత్యక్షంగా, మరికొన్ని అంశాల్లో పరోక్షంగా ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు.
- అక్కడ ఉండే భారతీయుల ఉద్యోగాలు పోవచ్చు. పలితంగా అక్కడ నుంచి మన దేశంలోని తల్లిదండ్రులు, ఆత్మీయులకు వారు పంపే నిధులు (రెమిటెన్సెస్) తగ్గిపోవచ్చు.
- అక్కడి వాణిజ్య సంస్థలు ఐటీ వ్యయాలు తగ్గించొచ్చు. ఇందువల్ల మన బటీ సేవల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. మాంధ్యం భయాల మధ్య కోఫోర్ట్, ఇన్ఫోసిస్ వంటి షేర్లు ఇప్పటికే నష్టపోయాయి.
- ఫిబ్రవరిలో మన ఎగుమతులు తగ్గాయి. అమెరికాలో మాంద్యం వస్తే మరింత తగ్గొచ్చు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ప్రభావం వల్ల అంతర్జాతీయ మందగమనమూ ఏర్పడొచ్చు.
- ఈ ఏడాది ఆసియాలో అత్యంత అధ్వాన పనితీరు కనబరుస్తున్న రూపాయి పై మరింత ఒత్తిడి పడొచ్చు.
- టారిఫ్లు, మాంద్యం కలిసి స్టాక్ మార్కెట్లు మరింత ఊగిసలాటకు దారితీయొచ్చు. విదేశీ పెట్టుబడులు, మూలధన ప్రవాహాలు, కరెన్సీ విలువల్లో భారీ అనిశ్చితి కనిపించొచ్చు.


